హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతులు

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.