హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆస్ట్రోటర్ఫ్ ప్రారంభంపై కమిషనర్‌కు వినతి

KDP: కడప మున్సిపల్ గ్రౌండ్‌లో రెండేళ్లుగా పూర్తయిన ఆస్ట్రోటర్ఫ్ హాకీ గ్రౌండ్‌ను వెంటనే ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని ధ్యాన్చంద్ హాకీ అకాడమీ డైరెక్టర్ షేక్ సుభాన్ భాష కోరారు. సోమవారం కమిషనర్ భవాని ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి త్వరలో గ్రౌండ్‌ను అందుబాటులోకి తెస్తామని కమిషనర్ తెలిపారు.