NZB: బాసర గోదావరి బ్రిడ్జిపై నవీపేట్ మండలానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. యంచ గ్రామానికి చెందిన యువకులు అప్రమత్తమై అతన్ని కాపాడారు. అనంతరం యువకుడ్ని బాసర పోలీసులకు అప్పగించారు. సకాలంలో గుర్తించి కాపాడిన యంచ యువకులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో యంచ సర్పంచ్ సాయిలు, ప్రవీణ్, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌తో పాటు యువకులు పాల్గొన్నారు.
తెలంగాణ
గోదావరి బ్రిడ్జిపై యువకుడి ఆత్మహత్యాయత్నం


