హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్రతిష్టపాలు చేయడమే కాంగ్రెస్ నైజం: బీజేపీ

GDWL: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తున్నారని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు విమర్శించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఓటు చోరీ డ్రామాలు ఆడుతోందన్నారు. బోగస్ ఓట్లను తొలగించడం ఆ పార్టీకి ఇష్టం లేదని సోమవారం పార్టీ కార్యాలయంలో ఆరోపించారు.