హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయదుర్గంలో తేలిన పోలింగ్ కేంద్రాల సంఖ్య..!

ATP: రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులకు జరగనున్న ఎన్నికల కోసం మొత్తం 80 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇవాళ పోలింగ్ కేంద్రాల వివరాలను సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. మొత్తం 53,696 మంది ఓటర్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారన్నారు.