TPT: రేణిగుంటలో ఏర్పాటు చేసిన వైన్ షాపులను తక్షణమే తొలగించాలని ఐద్వా నేతలు డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ సెల్లో డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. జనవాసాలు, పాఠశాలలు, గంగమ్మ ఆలయం, బస్టాప్ సమీపంలో వైన్ షాపులు ఏర్పాటు చేశారని తెలిపారు. మద్యం దుకాణాలతో మహిళలు, విద్యార్థుల భద్రతకు ముప్పు ఉందని, తొమ్మిది రోజులుగా నిరసనలు చేపడుతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైన్షాపులు వద్దంటు వినతి..


