ASR: డుంబ్రిగూడ మండలం పోతంగి గ్రామంలో వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ మండల కార్యదర్శి మఠం శంకర్, యువజన విభాగం అధ్యక్షుడు కమ్మిడి విజయదశమి తెలిపారు. గ్రామంలో 30 విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ ఒక్క వీధి దీపం కూడా ఏర్పాటు చేయలేదని రాత్రివేళ పాములు, తేళ్ల భయంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అంధకారంలో పోతంగి


