హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి'

ASF: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.