హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అండర్ పాస్ పనులపై మంత్రికి వినతి

NLR: ప్రమాదాలకు నిలయంగా మారిన నెల్లూరు చింతా రెడ్డిపాలెం జంక్షన్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని బ్రిడ్జి సాధన పోరాట కమిటీ నాయకుడు శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు సోమవారం మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రితో పోరాట కమిటీ నాయకులు మాట్లాడారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జ్ పనులు ప్రారంభించాలన్నారు.