SDPT: బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా డిప్యూటీ సీఈవో సంధ్యారాణి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై ఆమె ఆరా తీసినట్లు సమాచారం. కార్యాలయ నిర్వహణ, రికార్డుల వివరాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది.
తెలంగాణ
ఎంపీడీవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ


