హైదరాబాద్: 28°C
తెలంగాణ

జంగంపల్లి మీదుగా బస్సులు నడిపించాలని వినతి

KMR: పెద్ద మల్లారెడ్డికి జంగంపల్లి మీదుగా బస్సులు నడపాలని సర్పంచ్ సాయిగౌడ్ కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం కామారెడ్డి నుంచి వచ్చే బస్సులు ముత్యంపేట మీదుగా రావడంతో విద్యార్థులు, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో మాదిరిగానే జంగంపల్లి మీదుగా బస్సులు నడిపి సమస్య పరిష్కరించాలని కోరారు.