హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

AKP: బూరుగుపాలెం PHC పరిధిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. వైద్యాధికారులు డాక్టర్ చరిష్మా, డాక్టర్ సాయి చరణ్ పర్యవేక్షణలో దాలింపేట అంగన్‌వాడీ కేంద్రం, బూరుగుపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1 నుంచి 19 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. నులిపురుగుల నివారణ, రక్తహీనతను తగ్గించడమే కార్యక్రమం ప్రధానమని తెలిపారు.