SKLM: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న మందస మండలంలోని 1,759 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం 50 KG చొప్పున బియ్యం పంపిణీ చేపట్టింది. గెడ్డవూరులో ఎమ్మెల్యే గౌతు శిరీష పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ బి. శ్రీహరి, టీడీపీ మండల అధ్యక్షుడు భావన దుర్యోధన తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం


