హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో 'యువత భవితకు భరోసా'

PLD: వినుకొండలోని సాయి, రాధా డిగ్రీ కళాశాలల్లో ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. విద్యార్థులతో ఎంపీ ముఖాముఖిగా మాట్లాడి గాంధీజీ ఆశయాలు, దేశ నిర్మాణంలో యువత పాత్రను వివరించారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులతో యువతకు విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు.