హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

KNR: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీగా నిరసన చేపట్టారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని కోరారు. ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.