హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతులు లేకుండా డీజే.. కేసు నమోదు

SRD: అధిక శబ్దంతో డీజేలు నిర్వహించిన వారిపై అమీన్‌పూర్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బీరంగూడలో మూడు డీజే వాహనాలను ఏర్పాటు చేసి, ఈనెల 27 సాయంత్రం 5 గంటల నుండి 28 తెల్లవారుజామున 3:30 గంటల వరకు నిబంధనలకు విరుద్ధంగా హోరెత్తించారు. భారీ డిజిటల్ స్క్రీన్ల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో, స్థానికుల ఫిర్యాదుతో నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.