SRPT: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి మాట్లాడారు. సర్ ప్రక్రియలో ఓట్లను తొలగించేందుకు ఈసీ కుట్ర చేసిందన్నారు. ప్రతి ఓటును రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు.
తెలంగాణ
VIDEO: కేంద్ర ఎన్నికల అధికారి దిష్టిబొమ్మ దగ్ధం


