హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దివ్యాంగులకు వీల్ చైర్లు,శ్రవణ యంత్రాలు పంపిణీ

NLG: నల్గొండలో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ దివ్యాంగులకు వీల్ చైర్లు, శ్రవణ యంత్రాలు, చంక కర్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత సహాయక పరికరాల ఎంపిక శిబిరాన్ని నల్గొండ జిల్లా సంక్షేమ అధికారి లావణ్య కుమారి పరిశీలించారు. అర్హులైన దివ్యాంగుల నుంచి స్వయంగా దరఖాస్తులను స్వీకరించి, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.