హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా భగత్‌సింగ్‌ జయంతి వేడుకలు

GDWL: జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో సోమవారం భగత్‌సింగ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజిరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం భగత్‌సింగ్‌ చేసిన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.