హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

NLG: చేనేత సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు నేతృత్వంలో నేతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు హైదరాబాదులో సోమవారం వినతిపత్రం అందజేశారు. సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంఘాల రుణాలు మాఫీ చేయాలని, టెస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు.