హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామాజిక తనిఖీ కార్యక్రమం

MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రీతి రెడ్డి తెలిపారు.మండల పరిధిలోని 17 పంచాయతీలలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం  పనులపై అధికారులు ఈ తనిఖీలు చేపట్టనున్నారు. సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె సూచించారు.