MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 6 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో ప్రీతిరెడ్డి తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 14 మంది అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలలో 4 రెవెన్యూ శాఖకు, 2 పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినవని ఆమె పేర్కొన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
ప్రజావాణిలో 6 ఫిర్యాదులు స్వీకరణ


