హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం చంద్రబాబుకు మాధవ్ లేఖ

AP: సీఎం చంద్రబాబుకు బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ లేఖ రాశారు. 22ఏ పరిధిలోని అర్హత గల ప్రైవేట్, ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం తొలగించాలని కోరారు. ఒకే సర్వే నంబర్‌లోని డూప్లికేట్ ఎంట్రీలను తొలగించాలని, భూమి ఎందుకు నిషేధిత జాబితాలో ఉందో పారదర్శకంగా తెలపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 22ఏ తొలగింపు దరఖాస్తులపై విచారణ, నిర్ణయం, అప్పీల్‌కు స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయించాలన్నారు.