KMR: బీర్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహిస్తున్నారు. అన్నారంలో ఏఈఓ అనూష రైతుల పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగు చేస్తున్న పంటల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేశారు. పంటల సాగు, విస్తీర్ణం తదితర వివరాలను రైతుల నుంచి సేకరించారు. రైతులు సర్వేకు సహకరించి పంటల వివరాలను అందించారు.
తెలంగాణ
అన్నారంలో డిజిటల్ క్రాప్ సర్వే


