హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి'

MDK: వంశపారంపర్యంగా వచ్చిన ఐదు గుంటల స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని మెదక్ మండలం వాడి గ్రామానికి చెందిన గుమ్మల నరసింహ రెడ్డి (70) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ప్రతిమ సింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. పంచాయతీకి దరఖాస్తు చేసినా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే తిరస్కరించారని ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు.