హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన పేదలకే ఇళ్లు కేటాయించాలి'

MBNR: మిడ్జిల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు, పక్షపాతం జరుగుతున్నాయని ఆరోపిస్తూ BJYM రాష్ట్ర నాయకుడు పల్లె తిరుపతి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇల్లు కూలిపోయి నిరాశ్రయురాలైన వెలుగొమ్మల గ్రామ బాధితురాలికి వెంటనే ఇల్లు కేటాయించాలని కోరారు. గ్రామసభల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.