హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

సుప్రీంకోర్టు యూపీఐ లావాదేవీలపై MDR ఛార్జీల విధింపునకు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, RBI, NPCIలకు నోటీసులు జారీ చేసింది. రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై 0.4 శాతం MDR విధిస్తూ కేంద్రం ఈనెల 14న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీన్ని రద్దు చేయాలని న్యాయవాది అంజన్‌ దత్తా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.