హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యాయమైన పరిహారం అందించాలని రైతు వేడుకోలు

SRPT: లిఫ్ట్ ఇరిగేషన్ పైప్‌లైన్ కోసం సిరికొండ రెవెన్యూ పరిధిలో చేపట్టిన సర్వేలో తమ భూములు ప్రాజెక్టు పరిధిలోకి తీసుకున్నారని బురకచర్ల రైతు పుష్పమ్మ తెలిపారు. సర్వే నంబర్ 192లో 17 కుంటలు, 194, 195, 196లో 16 కుంటల భూమి పోతున్నట్లు పేర్కొన్నారు. భూమి విస్తీర్ణం, విలువకు అనుగుణంగా న్యాయమైన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.