హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేశ్

GNTR: మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేశ్ మూడో విడతలో 388 మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికే మొదటి విడతలో 3,200 మందికి, రెండో విడతలో 2,670 మందికి పట్టాలు అందజేశామన్నారు. దశాబ్దాలుగా ఇళ్లు లేని పేదలకు పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.