హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైకిల్‌పై GVMC నార్త్ జోన్ కమిషనర్ పర్యటన

VSP: GVMC నార్త్ జోన్ కమిషనర్ బొడ్డేపల్లి రాము మాధవధారలో సోమవారం సైకిల్‌పై పర్యటించారు. క్లాప్ వాహనాల పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ఆయన ప్రతి సోమవారం సైకిల్‌పై విధులకు హాజరవుతున్నారు.