హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'PGRS పరిష్కారంలో నాణ్యత పెంచాలి'

విశాఖ కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన పీజీఆర్ఎస్‌పై జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సమీక్షించారు. ప్రీ-ఆడిట్ సజావుగా నిర్వహించాలని, ఫిర్యాదులు రీ-ఓపెన్ కాకుండా చూడాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు మాట్లాడి, సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. సీఎంవో ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఆదేశించారు.