హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశు వైద్య కేంద్రంలో తడిసి ముద్దయిన మందులు

VZM: రేగిడి మండలం సంకిలిలోని పశు వైద్య కేంద్రంలో ఇటీవల తుఫాను వర్షాలకు మందులు తడిచి ముద్దయ్యాయి. గత 15 ఏళ్లుగా ఈ కేంద్రం శిథిలావస్థలో ఉండటంతో వర్షానికి ఇబ్బందులు తలెత్తాయి. తడిసిన మందుల పరిస్థితిపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా నిధులు సమకూర్చి నూతన భవనం నిర్మించాలని రైతులు కోరుతున్నారు.