హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రౌజింగ్ హిస్టరీ పేరుతో సైబర్ మోసం

RR: పోర్న్‌ వెబ్‌సైట్లు చూశారంటూ బెదిరించి ఓ ప్రైవేట్ ఉద్యోగినిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. క్రోమ్ బ్రౌజింగ్‌ హిస్టరీ డిలీట్‌ చేస్తామని నమ్మించి, వాట్సాప్‌లో పోలీసుల ఫొటోలు పంపి భయపెట్టారు. దీంతో బాధితురాలు విడతలవారీగా రూ.88 వేలు చెల్లించింది. మోసాన్ని గుర్తించి బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.