హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు

అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇవాళ ఉదయం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. జేసీ శౌర్య మాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు అర్జీలను స్వీకరించగా, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి అర్జీదారులు తరలివచ్చారు.