SKLM: ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం కూటమి ప్రభుత్వందే అని ఎమ్మెల్యే శిరీష అన్నారు. ఇవాళ పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రూ. 49.30 లక్షల నిధులతో నూతనంగా రైతు బజార్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత ప్రభుత్వం గాలి మాటలకే పరిమితం అయ్యిందని ఎద్దవా చేశారు. కేవలం మూడు నెలల కాలంలోనే రైతు బజార్ నిర్మాణం చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA


