గుంటూరు జిల్లాకు మహాకవి గుర్రం జాషువా పేరు పెట్టాలని మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. జాషువా జయంతి సందర్భంగా సోమవారం నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి దళిత సంఘాలతో కలిసి నివాళులర్పించారు. జాషువా జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని, జాషువా స్ఫూర్తిని భావితరాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జిల్లాకు 'జాషువా' పేరు పెట్టాలి: డొక్కా


