హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కల బెడదను నివారించాలని వినతి

NLG: చిట్యాల మండలం, నేరడ గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. పిచ్చికుక్కలు బడికి వెళ్లే పిల్లలను, గ్రామస్తులను వెంబడిస్తూ కరుస్తుండటంతో ప్రాణభయం పట్టుకుంది. గ్రామానికి చెందిన యువకులు వీరమల్ల అనిల్ కుమార్, వడ్డేపల్లి రమేష్, మిర్యాల సాయిరాం‌లు సోమవారం చిట్యాల‌లోని ప్రజావాణికి విచ్చేసి ఎంపీడీవో పాండు‌కు వినతిని అందించారు.