హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అదనపు బస్సు సౌకర్యం కల్పించాలి'

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామానికి మధ్యాహ్నం పూట APSRTC బస్సు అదనపు ట్రిప్పు సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లి తిరిగి రావడానికి మధ్యాహ్నం బస్సు లేక సాయంత్రం వరకు ఇబ్బంది పడుతున్నామన్నారు. పంచాయతీ పరిధిలోని 8 గ్రామాల ప్రజల సౌలభ్యం కోసం వెంటనే బస్సు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.