BPT: కారంచేడు మండలం కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విప్లవవీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఉమామహేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొడవలివారిపాలెంలో భగత్‌సింగ్ జయంతి


