హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళ్లరాంపూర్‌లో మళ్లీ వీడీసీ రగడ

NZB: నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్‌లో 39 గౌడ, 11 దళిత కుటుంబాలను వీడీసీ బహిష్కరించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. డప్పు చాటింపుతో బహిష్కరణ ప్రకటించి, కిరాణా సరుకులు విక్రయించవద్దని ఆంక్షలు విధించారని ఆరోపించారు. తమపై దాడి జరిగే అవకాశం ఉందని, రక్షణ కల్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.