తూ.గో: గోకవరంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) సోమవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కళ్లకు గంతలు కట్టుకుని వీఆర్వోలు నిరసన


