హైదరాబాద్: 28°C
తెలంగాణ

జానంపేటలో స్పీడ్ బ్రేకర్లకు గ్రామస్థుల డిమాండ్

MBNR: మూసాపేట మండలం జానంపేటలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సమీపంలోని ప్రహరీ లేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రహదారిపై ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. వేగంగా వెళ్లే వాహనాలతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాగరాజు, రామకృష్ణ కోరారు.