హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవి నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికల విడుదల

ASF: రెబ్బన మండలంలోని శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానంలో నిర్వహించే దేవి నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికలను దేవర వినోద్ స్వామి, ఆలయ అధ్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్, గ్రామ సర్పంచ్ అరుణ కృష్ణలు సోమవారం ఆవిష్కరించారు. అక్టోబర్ 11 నుంచి 20 తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.