PDPL: ధర్మారం మండల కేంద్రంలో పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో 2కె రన్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. యువత భగత్‌సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పీపుల్స్ యువసేన అధ్యక్షుడు మేకల సంజీవరావు పిలుపునిచ్చారు. కొమురయ్య, తిరుపతి, సిద్దు, మహేష్, నాగరాజు, రంజిత్ పాల్గొన్నారు.
తెలంగాణ
పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో 2కే రన్


