RR: తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. కూరగాయల తొక్కలు, మిగిలిన ఆహారం వంటి తడి వ్యర్థాలను పచ్చ బిన్‌లో వేయాలని కోరింది. వీటిని వేరు చేయడం ద్వారా సహజ కంపోస్ట్ తయారై నేల సారాన్ని పెంచుతుందని తెలిపింది. పరిశుభ్రమైన మల్కాజిగిరి కోసం ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
తెలంగాణ
చెత్త వేరు చేయండి.. కంపోస్ట్ చేయండి


