మయన్మార్-అండమాన్ సమీపంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 12గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్ మధ్య 72 గంటల్లో తీరం దాటే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వార్తలు
మయన్మార్-అండమాన్ సమీపంలో వాయుగుండం


