హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వానాకాలం.. వనవాసమే!

PPM: వానొస్తే జిల్లా కేంద్రంలో వణుకే.. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 'వరహాల గెడ్డ ఉగ్రరూపం దాల్చుతుండడంతో బైపాస్ కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. ప్రతి ఏడాదీ వానాకాలం ముంపు బారిన పడడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ఇటీవల తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు సైతం కాలనీ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.