హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్ విద్యార్థులకు యోగా శిక్షణ

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి బీసీ హాస్టల్‌లో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హ్యాపీనెస్ కోర్స్ ఇవాళ ప్రారంభమైంది. సర్పంచ్ కాటం వెంకటేశం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో యోగా శిక్షకుడు పల్లపు బుద్ధుడు యోగ, ధ్యానం, ప్రాణాయామం ప్రాముఖ్యతను వివరించారు. వీటిని ఆచరించడం ద్వారా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.