NRPT: నారాయణపేట పట్టణంలో డ్రాగన్ షోటోకాన్ కరాటే డూ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొర్ల డేవిడ్ తదితరులు హాజరై విద్యార్థులను అభినందించారు. కరాటేతో ఆత్మరక్షణ, శారీరక ఆరోగ్యం, మానసిక స్థిరత్వం పెరుగుతాయని డేవిడ్ తెలిపారు. బాలికలకు కరాటే ఆత్మరక్షణ విద్య ఎంతో అవసరమన్నారు.
తెలంగాణ
బాలికలకు కరాటే ఎంతో అవసరం: డేవిడ్


