WGL: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన నిమ్మరబోయిన విజయలక్ష్మి (37) కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహంలో సోమవారం పని చేస్తుండగా ప్రమాదవశాత్తు వేడి నీళ్లు పడి గాయపడింది. ఘటనలో ఆమె శరీరంపై గాయాలు కాగా, వెంటనే 108 సిబ్బంది చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ
వేడి నీళ్లు పడి మహిళకు గాయాలు


